అన్ని మతాల ప్రజలకు సమ ప్రాధాన్యత

టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని మతాల ప్రజలకు సమ ప్రాధాన్యత కల్పిస్తూ అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తోందన్నారు మంత్రి పద్మారావు. రంజాన్ పండుగ సందర్భంగా సికింద్రాబాద్ చిలకలగూడలోని చోటా మసీద్, బడా మసీద్ లలో పేద ముస్లింలకు దుస్తులను పంపిణీ చేశారు. ఆ తర్వాత చిలకలగూడ ఈద్గాను సందర్శించి రంజాన్ ఏర్పాట్లను పరిశీలించారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవించడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు.