అన్నపూర్ణ 150వ కేంద్రం ప్రారంభం

హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న అన్నపూర్ణ క్యాంటీన్లు 150 చేరాయి. గోషామహల్ నియోజకవర్గంలోని మంగళ్ హాట్ లో ఐదు రూపాయల భోజన కేంద్రాన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. మేయర్ బొంతు రాంమోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్, కమిషనర్ జనార్థన్ రెడ్డి, కార్పోరేటర్స్ పరమేశ్వరి సింగ్, ముఖేష్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరితో కలిసి క్యూలో నిలబడి భోజనం చేశారు. ఐదు రూపాయల భోజనం బ్రహ్మాండంగా ఉందని ప్రశంసించారు.

హైదరాబాద్ లో పేదల ఆకలి తీరుస్తున్న ఐదు రూపాయల భోజన కేంద్రాలు 150కి పెంచాలన్న సీఎం కేసీఆర్ సూచన మేరకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు.