అనుపమ లాడ్జిలో భారీ అగ్నిప్రమాదం

రంగారెడ్డి  జిల్లా  శంషాబాద్‌లోని అనుపమ లాడ్జిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 8 అంతస్తుల లాడ్జి భవనంలో రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి.  ఈ ప్రమాదంలో 50 మంది చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకుని ఎగసి పడుతున్న మంటలను అదుపులోకి తెచ్చారు. లాడ్జిలోని వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. షార్ట్ సర్కూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు.