అనాథాశ్రమం కొత్త భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన

హైదరాబాద్ నాంపల్లిలోని అనిస్ ఉల్ గుర్బా అనాథాశ్రమం నూతన భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణ నమూన చిత్రాలను ముఖ్యమంత్రి చూశారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.