అధికార లాంఛనాలతో పాల్వాయి అంత్యక్రియలు

రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. నల్లగొండ జిల్లా చండూరు మండలంలోని ఆయన స్వగ్రామం ఇడుకుడిలో అంత్యక్రియలు నిర్వహించారు.

మంత్రి జగదీశ్ రెడ్డి, టిఆర్ఎస్ పీపీ నేత కె.కేశవరావు, టిఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత జితేందర్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గ్యాదరి కిశోర్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, పూల రవీందర్, జడ్పీ చైర్మన్ బాలు నాయిక్, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, వి.హనుమంతరావు,  మర్రి శశిధర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జీవన్ రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్వాయి అంత్యక్రియలకు హాజరయ్యారు. పాల్వాయిని కడసారి చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.