అది పూర్తిగా అసత్య ప్రచారం!

తెలుగులో అభినయ ప్రాధాన్యమున్న పాత్రలతో ఆకట్టుకుంటుంది మలయాళ భామ నిత్యామీనన్‌. ఉన్నట్టుండి నిత్యకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. దానికి కారణం ఆమె ఆలోచనలు దర్శకత్వంపైపు మలుపు తిరగడమే అనే వార్తలు వినిపించాయి. దీని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిత్యామీనన్‌ మాట్లాడింది. ‘నాకు దర్శకత్వం మీద ఇష్టమున్నట్టు ఎప్పుడూ చెప్పలేదు. అది పూర్తిగా అసత్య ప్రచారం. నేను ఇప్పట్లో దర్శకత్వంవైపు వెళ్లాలనుకోవడం లేదు” అని  చెప్పింది. డైరెక్టర్‌గా మారాలనే ఆలోచనతోనే మణిరత్నం సినిమా అవకాశాన్ని కూడా నిత్య వదులుకుందని కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగింది.