అచ్చం సావిత్రి లాగే ఉంది!

మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా కీర్తి సురేష్‌ ప్రధాన ప్రాతలో ఓ సినిమా తెరకెక్కుతున్నది. ఆ సినిమా పేరు ‘మహానటి’. అశ్వనీదత్‌ నిర్మాణంలో నాగ్‌అశ్విన్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆ మహానటి పాత్రలో కీర్తి సురేష్‌ కనిపించనుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ షూటింగ్‌ లొకేషన్‌కు అచ్చం సావిత్రిలాగానే తయారై వచ్చింది కీర్తి సురేష్‌. రెండు జడలతో ‘మిస్సమ్మ’ సినిమాలో సావిత్రిలా కీర్తి కనిపిస్తున్నది. కీర్తి కంటే ముందు సావిత్రి పాత్ర కోసం నిత్యామీనన్‌, విద్యా బాలన్‌ను అనుకున్నారు. చివరకు కీర్తి సురేష్‌ను ఎంచుకున్నారు డైరెక్టర్‌ నాగ్‌అశ్విన్‌.