అగంతకుడి కాల్పుల్లో పలువురికి గాయాలు

జర్మనీలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. మునిచ్‌ లోని సబర్బన్‌  రైల్వే స్టేషన్‌ లో ఓ అగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులతో పాటు ఓ పోలీస్‌   ఆఫీసర్  కూడా గాయపడ్డారు. వెంటనే అలర్టయిన పోలీసులు.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. అనుమానితుణ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రయాణికులను రైల్వే స్టేషన్ నుంచి ఖాళీ చేయిస్తున్నారు. పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.