అఖిల్‌కు త‌ల్లిగా ట‌బు!

టాలీవుడ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. ఒక‌ప్పుడు టాప్ హీరోయిన్‌గా తెలుగు సినిమాను ఏలిన ట‌బు.. అఖిల్ అక్కినేని త‌ర్వాతి సినిమాలో అత‌నికి త‌ల్లిగా క‌నిపించ‌బోతున్నట్లు సమాచారం. ఈ సినిమాను నాగార్జున నిర్మిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ట‌బు ఒక‌ప్పుడు నాగార్జున స‌ర‌స‌న హిట్ సినిమాల్లో న‌టించింది. అంతే కాదు అత‌డితో డేటింగ్ కూడా చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఇప్ప‌టికీ నాగ్‌తో ట‌బుకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఎప్పుడు హైద‌రాబాద్ వ‌చ్చినా నాగ్ ఇంట్లోనే బ‌స చేస్తాన‌ని గ‌తంలో ట‌బు  చెప్పింది. అలాంటి ట‌బు ఇప్పుడు అఖిల్‌కు త‌ల్లి పాత్ర పోషించ‌నుంద‌న్న‌ది క‌చ్చితంగా ఆస‌క్తిక‌ర విష‌యం. క్యారెక్ట‌ర్ న‌చ్చినందుకే ఆమె ఈ రోల్‌కు అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం.