అక్షయ్‌ మూవీపై ప్రధాని ప్రశంసలు

అక్షయ్‌ కుమార్‌ చిత్రం ‘టాయిలెట్‌ ఏక్‌ ప్రేమ్‌ కథ’ ట్రైలర్‌ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. పరిశుభ్రతపై అవగాహన కల్పించడంలో ఈ సినిమా ఒక గొప్ప ప్రయత్నమని కొనియాడారు. ఈ చిత్రం ట్రైలర్‌ లింకును అక్షయ్‌కుమార్‌ మోడీతో పంచుకున్నారు. పరిశుభ్రతపై సందేశాన్ని ప్రచారం చేయడానికి ఇది మంచి ప్రయత్నం. స్వచ్ఛ్‌ భారత్‌ సాకారానికి 125 కోట్ల మంది భారతీయులు కలిసి పనిచేయాలని మోడీ ట్వీట్‌ చేశారు.