అక్బరుద్దిన్ పై హత్యాయత్నం కేసు తుది తీర్పు

ఎంఐఎం తెలంగాణ శాసనసభాపక్ష నేత అక్బరుద్దిన్ ఒవైసీపై హత్యాయత్నం కేసులో హైదరాబాద్ నాంపల్లి కోర్ట్ తుది తీర్పు ఇచ్చింది. కీలక నిందితుడు పహిల్వాన్ సహా 10 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. హసన్, అబ్దుల్లా, అవద్, వహ్లాన్ లను దోషులుగా తేల్చింది. వీరికి పదేళ్ల జైలుశిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.10 వేలు జరిమానా విధించింది. దోషులు ఇప్పటికే అనుభవించిన ఆరేళ్ల జైలుశిక్షను మొత్తం జైలుశిక్ష నుంచి మినహాయించింది.

2011 ఏప్రిల్ 30న హైదరాబాద్ పాతబస్తీలోని బార్కస్ లో అక్బరుద్దిన్ పై తుపాకులు, కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో అక్బరుద్దిన్ తీవ్రంగా గాయపడ్డారు. 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వీరిలో 8 మంది ప్రస్తుతం జైలులో ఉండగా, మరో ఆరుగురు బెయిల్ పై విడుదలయ్యారు. ఒకరు చనిపోయాడు. ఈ కేసులో 86 మంది సాక్షులను కోర్టు విచారించి, తుది తీర్పు ఇచ్చింది.