8 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం

రాష్ట్రంలో 8 కార్పొరేషన్లకు సీఎం కేసీఆర్ చైర్మన్లను నియమించారు.

-తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి.

-ఉమెన్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ గా వరంగల్ కు చెందిన మాజీ ఎంపి (రాజ్యసభ) గుండు సుధారాణి

-తెలంగాణ రాష్ట్ర హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా మడుపు భూమ్ రెడ్డి (మెదక్ జిల్లా)

-తెలంగాణ రాష్ట్ర గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా గాంధీ నాయక్ (వరంగల్ జిల్లా)

-తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్, టివి అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పుష్కర్ రామ్మోహన్ రావు (ఆదిలాబాద్ జిల్లా మందమర్రి)

-తెలంగాణ రాష్ట్ర వికలాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా కె.వాసుదేవ రెడ్డి (కెయు విద్యార్థి నాయకుడు)

-మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ (గోషామహల్)

-తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్ గా డాక్టర్ చిరుమిల్ల రాకేశ్ కుమార్ (ఓయు విద్యార్థి నాయకుడు –పెద్దపల్లి)

వీరితో పాటు మెదక్ డిసిసిబి మాజీ అధ్యక్షుడు ఎలక్షన్ రెడ్డి పేరును కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవికి సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ప్రస్తుతం ఎలక్షన్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నందువల్ల ఆయన తిరిగి హైదరబాద్ రాగానే చర్చించి ఏ కార్పొరేషన్ బాధ్యతలు అప్పగించాలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయిస్తారు.