30న మెడికల్ షాపుల బంద్

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 30వ తేదీన మెడికల్ దుకాణాల యజమానులు బంద్ పాటించనున్నారు. ఈ బంద్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌ రిటెయిల్‌ మెడికల్‌ షాప్స్ సంఘం పాల్గొంటుందని ప్రకటించింది. ఈ-పోర్టల్‌ విధానంపై తమను సంప్రదించకుండా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని వారు చెప్పారు. ప్రజలకు అవగాహన కల్పించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదన్నారు.