హాట్ టాపిక్ గా మారిన రాజస్థాన్ హైకోర్ట్ సూచన!

పశు విక్రయాలపై కేంద్రం విధించిన ఆంక్షలను వ్యతిరేకిస్తూ ఒక పక్క దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతుంటే… రాజస్థాన్ హైకోర్టు చేసిన సూచన హాట్ టాపిక్ గా మారింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అంతేకాదు, ప‌శువుని వ‌ధిస్తే విధించే మూడేళ్ల జైలు శిక్షను జీవిత కాల శిక్షగా మార్చాల‌ని కోర్టు త‌న తీర్పులో ఆదేశించింది. జైపూర్ స‌మీపంలో ఉన్న ఓ గోశాల‌కు సంబంధించిన కేసులో జ‌డ్జి మ‌హేశ్ చంద్ర శర్మ ఈ సూచ‌న చేశారు.

ప్రస్తుతం రాజ‌స్థాన్‌ లో బీజేపీ ప్రభుత్వం ఉంది. గోవ‌ధ‌కు పాల్పడేవాళ్లపై క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటామ‌ని ఆ రాష్ట్ర సీఎం వ‌సుంధర రాజే ఇటీవ‌లే వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ హైకోర్టు తీర్పు హాట్ టాపిక్ గా మారింది.

మరోవైపు, పశువుల అమ్మకాలు, వధపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆంక్షలను కేరళ ముఖ్యమంత్రి వ్యతిరేకించగా.. ఆ రాష్ట్ర హైకోర్ట్ సమర్థించింది.