సోపోర్ లో ఉగ్రదాడి, నలుగురు పోలీసులకు గాయాలు

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోపోర్ లోని జమ్మూకాశ్మీర్ బ్యాంక్ దగ్గర పోలీస్ పార్టీపై బాంబు విసిరారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలాన్ని ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు… ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. గాయపడ్డ పోలీసులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.