సివిల్స్ ఫలితాలు విడుదల, నందిని టాపర్!

సివిల్స్-2016 ఫలితాలను యుపిఎస్సి వెల్లడించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఈ పరీక్షల్లో కర్నాటకకు చెందిన కేఆర్ నందిని టాపర్ గా నిలిచారు. అనుమోల్ షేర్ సింగ్ బేడీ రెండో ర్యాంక్, గోపాలకృష్ణ రోనంకి మూడో ర్యాంక్ సాధించారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ వ్యవహారాల సలహాదారు, మాజీ ఐపిఎల్ అధికారి ఏకే ఖాన్ కుమారుడు ముజమిల్ ఖాన్ జాతీయ స్థాయిలో 22వ ర్యాంక్, తెలంగాణలో తొలిర్యాంక్ సాధించారు.  2016 డిసెంబర్ లో మెయిన్స్ పరీక్షలు జరగగా ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్-ఏ, గ్రూప్-బీ విభాగాల్లో మొత్తం 1099 మంది అభ్యర్థులు సెలక్ట్ అయ్యారు.