సంప్రదాయ దుస్తులు ధరించాల్సిందే!

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి అంతరాలయంలోకి రేపటి నుంచి సంప్రదాయ దుస్తులు ధరించిన భక్తులకే ప్రవేశం కల్పించాలని దేవస్థానం తీర్మానించింది. జూన్ 1నుంచి స్వామివారి అంతరాలయంలో ప్రత్యేక పూజలు, నిత్యకల్యాణ సేవల్లో పాల్గొనే భక్తులు విధిగా ఈ నియమాన్ని పాటించాలని ఉత్తర్వులు జారీచేసింది. పురుషులు పంచె, కండువా మహిళలు చీర, పంజాబీ డ్రెస్ ధరిస్తేనే అనుమతిస్తామని జీన్స్, టీ షర్ట్‌లను అనుమతించబోమని తెలిపింది.