సంగారెడ్డి అభివృద్ధికి మరిన్ని నిధులు

సమైక్య పాలనలో ఆగమైన సంగారెడ్డిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి హరీశ్‌ రావు. పట్టణాభివృద్ధికి ఇప్పటికే ఆరు కోట్లు మంజూరు చేశామన్న ఆయన.. అవసరమైతే మరో రెండు కోట్లు ఇవ్వడానికీ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎంత ఖర్చయినా సరే సంగారెడ్డి పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు బాగు చేస్తామని చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రులు హరీశ్ రావు, తలసాని.. మల్కాపూర్ పెద్ద చెరువు నుంచి మహబూబ్ సాగర్ వరకు ఫీడర్ చానల్ పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.