శ్రీలంకలో వరదల బీభత్సం, 91 మంది మృతి

శ్రీలంకలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వీటి దాటికి కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ ఎఫెక్ట్ కు ఇప్పటివరకు 91 మంది మృతిచెందారు. మరో 110 మందికి పైగా గల్లంతైనట్టు అధికారులు వెల్లడించారు. దక్షిణ, ఉత్తర శ్రీలంక ప్రాంతాల్లో ఇప్పటివరకు సుమారు 20వేల మందికి పైగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మిలటరీ బోట్లు, హెలీ కాప్టర్లతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కొండ చరియల కింద చిక్కుకున్న వారి మృతదేహాలను వెలికి తీస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. తమ దేశానికి సహకరించాల్సిందిగా ఇప్పటికే శ్రీలంక ప్రభుత్వం ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేసింది. ఈ వరదలతో పెను ప్రమాదం పొంచి ఉండటంతో ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసింది.