శృతి హాసన్ భయపడిందా?

తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతుంది శృతి హాసన్. ప్రస్తుతం సంఘమిత్ర అనే భారీ బడ్జెట్ చిత్రం కోసం పలు కసరత్తులపై శిక్షణ తీసుకుంటుంది. అయితే శృతి రీసెంట్ గా హిందీలో బెహన్ హోగీ తేరి అనే చిత్రంలో నటించింది. అజయ్ పన్నాలాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్ర పోషించాడు. ఈ మూవీని జూన్ 2న విడుదల చేయాలని యూనిట్ భావించింది. కాని అదే రోజు భారీ పోటి నెలకొన్న నేపథ్యంలో శృతి హిందీ చిత్రం జూన్ 9కి పోస్ట్ పోన్ అయిన‌ట్టు చెబుతున్నారు. జూన్ 2న బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ చిత్రం బేవాచ్ తో పాటు వండర్ ఉమెన్ విడుదల కానుంది. ఈ రెండు సినిమాలపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో తమ సినిమాని విడుదల చేసి రిస్క్ చేయడం ఎందుకా అని భావించిన బెహన్ హోగీ తేరి నిర్మాతలు ఈ చిత్రాన్ని వాయిదా వేసినట్టు సమాచారం.