శాంతి మార్గంలో ముందుకెళ్లాలి

రంజాన్ పవిత్ర మాసంలో శాంతి మార్గంలో ముందుకెళ్లాలని ప్రధాని మోడీ ప్రజలకు సూచించారు. ఒక్కో మతంలో ఒక్కో సాంప్రదాయం ఉంటుందని.. ఎదుటి వారి మతాలను గౌరవించాలని చెప్పారు. ఆకాశవాణి ద్వారా 32వ మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన..  రంజాన్‌  నెల ప్రారంభమైన సందర్భంగా ముస్లీంలకు శుభాకాంక్షలు తెలియజేశారు. జూన్‌ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని చెప్పారు. యోగా.. శరీరం, బుద్ది, ఆత్మ లాగా ప్రపంచాన్ని అనుసంధానిస్తుందని ప్రధాని మోడీ తెలిపారు.