శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో హై అలర్ట్‌

హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో హై అలర్ట్‌ ప్రకటించారు. పాకిస్తాన్ నుండి 21 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడ్డారంటూ కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని ఎయిర్ పోర్టుల్లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇటు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు.