వేర్పాటువాదుల బంద్ పిలుపు భేఖాతరు

వేర్పాటువాదుల కాశ్మీర్ బంద్ పిలుపు అట్టర్ ఫ్లాప్‌ అయ్యింది. హురియత్‌ నేతల పిలుపును పక్కన బెట్టి మరీ పెద్ద ఎత్తున యువత ఆర్మీ రిక్రూట్ మెంట్ పరీక్షకు హాజరయ్యారు. 815 మంది ఎంపిక చేసిన అభ్యర్థుల్లో 799 మంది యువకులు పరీక్ష రాసినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. ఇండియన్ ఆర్మీ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ మరియు ఇతర ర్యాంక్ పోస్టుల కోసం శ్రీనగర్, పట్టణ్ లలో ఈ పరీక్ష జరిగింది.

హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాది సబ్జర్ భట్‌ ఎన్‌ కౌంటర్‌ ను నిరసిస్తూ  వేర్పాటువాదులు బంద్‌ కు పిలుపునివ్వగా.. కాశ్మీర్‌ లోయలో ఎక్కడా దాని ప్రభావం కన్పించలేదు.