వెటర్నరీ విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తాం

వెటర్నరీ విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. వెటర్నరీ శాఖలోని అన్ని పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేస్తామని తెలిపారు. సచివాలయంలో సంచార పశు వైద్యశాల వాహనాన్ని పరిశీలించిన మంత్రి తలసాని.. మీడియాతో మాట్లాడారు.కొందరు రాజకీయ నిరుద్యోగులు, విద్యార్థులను అడ్డంపెట్టకుని డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కాబట్టి విద్యార్థులు వారి మాయలో పడి భవిష్యత్‌ను పాడు చేసుకోవద్దని సూచించారు.

అటు హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని పర్యటించారు. ఎస్ఆర్ నగర్ లో 2,550 గజాలలో కమ్యూనిటి హల్ నిర్మిస్తాం అని మంత్రలు తెలిపారు. ఇందుకోసం స్థలాన్ని పరిశీలించిన మంత్రులు..  స్థానికుల అవసరాలకోసం మంచి భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు.