వరంగల్ పోలీస్ హెడ్ క్వార్టర్ కు శంకుస్థాపన

వరంగల్ పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అండ్ పబ్లిక్ ఇంటర్‌ఫెసిలిటీ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రి చందులాల్,  డీజీపీ అనురాగ్‌ శర్మ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, ఎంపీలు సీతారాం నాయక్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ, కుడా చైర్మన్ యాదవరెడ్డి పాల్గొన్నారు.