వచ్చే నెల 1 నుంచి కొత్త కానిస్టేబుళ్లకు శిక్షణ

రెండో విడత కానిస్టేబుల్ శిక్షణ వచ్చే నెల 1 నుంచి మొదలవుతుందని రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ ప్రకటించారు. ఈ నెల 30వ తేదీన రెండో విడత శిక్షణ అర్హులకు అందిన పత్రంతో సంబంధిత యూనిట్ కార్యాలయాలలో,  31 వ తేదీన శిక్షణ కేంద్రంలో రిపోర్ట్ చేయాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఏఆర్ మరియు సివిల్ అభ్యర్థులు దాదాపుగా 939 మంది, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ అభ్యర్థులు దాదాపుగా 340 మందికి ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి అధికారులు, సిబ్బంది కృషి కారణమని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. హైదరాబాద్ లోని డీజీపీ ఆఫీస్ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్ లో 75 ఉత్తమ సేవ పతకాలని, 55 పోలీస్ మెడల్స్ ను పోలీస్ అధికారులకు అందచేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీస్ శాఖ క్షేత్ర స్థాయి నుంచి వినూత్నమైన కార్యాచరణతో ముందుకు వెళ్తోందన్నారు.  రాష్ట్రానికి 26 గ్యాలంటరీ అవార్డులు రావడం పట్ల డీజీపీ హర్షం వ్యక్తం చేశారు. ఈ 26 గ్యాలంటరీ అవార్డులు 2016 స్వాతంత్య్ర దినోత్సవంలో అందజేశారని డీజీపీ గుర్తుచేశారు.