రాష్ట్రపతి అభ్యర్థిపై నిర్ణయం తీసుకోని ప్రతిపక్షాలు

రాష్ట్రపతి అభ్యర్థిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. విపక్ష పార్టీలతో కూడిన కమిటీ చర్చించి అభ్యర్ధిపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో 17 ప్రతిపక్ష పార్టీల నేతలు పార్లమెంటు లైబ్రరీ భవనంలో సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత మమత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికతో పాటు, మూడేళ్ల ఎన్డీయే పాలనపై చర్చ జరిగిందన్నారు. రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎవరి పేరు ప్రస్తావనకు రాలేదన్నారు.