రాజ్‌భవన్ స్కూల్‌ను సందర్శించిన కడియం

దాదాపు 4.5 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన రాజ్ భవన్ పాఠశాలను గవర్నర్ నరసింహన్ తో కలిసి ఈ రోజు ఉదయం ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పరిశీలించారు. రాజ్ భవన్ పాఠశాలను ఈ విద్యా సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియం పాఠశాలగా మారుస్తున్నట్లు ఈ సందర్భంగా కడియం తెలిపారు. ఇక్కడ చదువుతున్న తెలుగు మీడియం విద్యార్థులను పక్కనే ఉన్న పాఠశాలల్లో సర్దుబాటు చేయనున్నట్లు చెప్పారు. గవర్నర్ ఆదేశాల మేరకు పాఠశాలలు పునః ప్రారంభమయ్యేనాటికి డైనింగ్ హాల్, బయోమెట్రిక్ మెషీన్లు, ఆర్వో ప్లాంట్, కంప్యూటర్ లాబ్స్, సీసీ కెమెరాలు, మౌలిక సదుపాయాలు అన్నింటిని కల్పించి మోడల్ స్కూల్ గా అభివృద్ధి చేస్తామన్నారు.