యోగికి తలనొప్పులు తెస్తున్న అధికారులు

యూపీ సీఎం పర్యటనలో అధికారుల అత్యుత్సాహం మరోసారి బయటపడింది. దళిత వర్గాలను కలుసుకునేందుకు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భాగంగా సీఎం యోగీ ఆదిత్యానాథ్.. కుషినగర్ అనే గ్రామానికి వచ్చారు. అయితే సీఎం పర్యటన కంటే ముందు రోజు.. ఆ గ్రామానికి వచ్చిన అధికారులు.. గ్రామస్తులకు సబ్బులు, షాంపూలు ఇచ్చారు. సీఎం వస్తున్నారు, శుభ్రంగా స్నానం చేసి రండి అంటూ గ్రామస్థులను ఆదేశించారు. యోగి పర్యటన కంటే ఒక రోజు ముందే.. ఆ గ్రామంలో రోడ్లు, కరెంట్, టాయిలెట్లు ఏర్పాటు చేశారు. కుషి నగర్ లో ముషర్ వర్గ ప్రజలు ఎక్కువగా ఉంటారు. వీరంతా ఎలుకలను పట్టడమే జీవన భృతిగా ఎంచుకొని జీవిస్తున్నారు. గతంలో కూడా బీఎస్‌ఎఫ్‌ జవాను ప్రేమ్‌సాగర్‌ కుటుంబాన్ని యోగి కలవనున్నారని తెలిసి అప్పటికప్పుడు వారింట్లో సోఫా, ఏసీ, కార్పెట్లు ఏర్పాటు చేశారు. ఆయన వెళ్లిపోయిన వెంటనే వాటన్నింటినీ వాటన్నింటిని తీసుకెళ్లారు అధికారులు.