యూపీలో బరితెగించిన పోకిరీలు

ఉత్తర ప్రదేశ్‌ లో పోకిరీలు బరితెగించారు. రాంపూర్‌ లో తల్లీకూతుళ్లతో అసభ్యంగా ప్రవర్తించారు. వారిని లైంగికంగా వేధిస్తూ.. రాక్షస ఆనందాన్ని పొందారు. విడిచిపెట్టాలని కన్నీళ్లు పెట్టుకున్నా బాలికపై చెయ్యేస్తూ నరకం చూపించారు. వెకిలి నవ్వులతో శాడిజాన్ని ప్రదర్శించారు. అంతటితో ఆగకుండా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. యాంటీ రోమియో స్క్వాడ్‌ లు ఏర్పాటు చేశామని యోగి సర్కార్‌ గొప్పలు చెప్పుకుంటున్నా.. అవి ఎక్కడా పని చేయట్లేదని స్థానికులు చెప్తున్నారు.