మెలానియా జాకెట్ ధర రూ.33 లక్షలట!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భార్య మెలానియా ట్రంప్‌ ఇటలీలో ధరించిన ఓ జాకెట్‌ పై హాట్‌ హాట్‌ గా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆమె ధరించిన ఈ ప్రత్యేకమైన జాకెట్‌ ధర 33 లక్షల రూపాయలు. ఇటలీ, కెనడా, ఫ్రాన్స్‌ ప్రధానుల భార్యలతో కలసి మెలానియా ఇటలీలో పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఈమె ధరించిన ‘డోల్స్‌ అండ్‌ గబ్బానా’ కంపెనీ జాకెట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎంతటి ధనవంతులైనా రూ.16 లక్షల 50 వేలు అడ్వాన్సుగా చెల్లిస్తేనే దీన్ని కంపెనీ తయారుచేస్తుంది. అలాంటిది అగ్రరాజ్యం అధినేత భార్య కోరగానే ఈ జాకెట్ రెడీ చేసింది పెట్టింది ఆ సంస్థ.