మెర్కల్ తో ప్రధాని మోడీ సమావేశం

జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ ఏంజెలా మెర్క‌ల్‌తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ అయ్యారు. బ్రాండ‌న్‌బ‌ర్గ్ జిల్లాలో ఉన్న 18వ శ‌తాబ్ధానికి చెందిన స్క‌లాస్ మెస్‌బ‌ర్గ్ బిల్డింగ్ ఆవ‌ర‌ణ‌లో ఇద్ద‌రూ కాసేపు ముచ్చ‌టించారు. దేశాధినేత‌లు ఇద్ద‌రూ విందు అనంత‌రం మెస్‌బ‌ర్గ్ లాన్‌లో ప‌లు అంశాల‌పై మాట్లాడుకుంటూ క‌లియ తిరిగారు. ద్వైపాక్షి అంశాల‌పై ఇద్ద‌రూ చ‌ర్చించుకున్నారు. వాణిజ్యం, యూరోప్ ఉగ్ర‌దాడుల గురించి మాట్లాడుకున్నారు. వ‌న్ బెల్ట్‌, వ‌న్ రోడ్, వాతావ‌ర‌ణ మార్పుల అంశాన్ని కూడా చ‌ర్చించారు. మెర్క‌ల్‌తో మంచి చ‌ర్చ‌లు సాగిన‌ట్లు మోడీ ట్వీట్ చేశారు. స్మార్ట్ సిటీలు, నైపుణ్యాభివృద్ధి, శుద్ధ ఇంధ‌నం లాంటి అంశాల‌ను కూడా సుదీర్ఘంగా చ‌ర్చించారు. భార‌త ప్ర‌భుత్వం చేప‌ట్టిన జీఎస్టీ బిల్లును మెర్క‌ల్ మెచ్చుకున్న‌ట్లు పీఎంవో  అధికారులు తెలిపారు.