మూడ్‌ని బట్టి  మాటలు మారుతాయ్!

సంఘమిత్ర సినిమాలో వారియర్‌ ప్రిన్సెస్ గా నటిస్తోన్న శ్రుతీహాసన్ అటు బాలీవుడ్‌లోనూ ఓ సినిమా చేస్తోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడింది. ‘‘నా స్టేట్‌మెంట్‌ ఎప్పుడూ నిలకడగా ఉండదు. రోజురోజుకూ మారుతూ ఉంటుంది నా మూడ్‌ని బట్టి ఉంటుంది. నేను వెళ్తున్న ప్రదేశాన్ని బట్టి, పండుగలను, పబ్బాలను బట్టీ ఉంటుంది. చిన్నతనంలో ఎక్కువగా వెస్టర్న్‌ వేర్స్‌ని ఇష్టపడేదాన్ని. కానీ వయసు పెరిగే కొద్దీ చీరలు, లంగా ఓణీలు వేసుకోసాగాను. ఆల్‌ టైమ్‌ కంఫర్ట్‌ మాత్రం కుర్తా, జీన్స్. కుర్తా, జీన్స్ వెస్టర్న్‌ డ్రస్సా? ఇండియన్ డ్రస్సా? నా మనసులో ఎప్పుడూ దీని గురించి డిబేట్‌ జరుగుతూ ఉంటుంది. ట్రావెల్‌ చేసేటప్పుడు నేను నా దుస్తుల విషయంలో పర్టిక్యులర్‌గా ఉండను. ఏది చేతికి దొరికితే అది వేసుకుంటా. మామూలుగా అయితే ముదురు రంగుల జోలికి వెళ్లను. సటిల్‌, కూల్‌ రంగులే ధరిస్తాను’’ అని అన్నారు. సినిమాల విషయాన్ని ప్రస్తావిస్తూ ‘‘ఆయా చిత్రాల్లోని పాత్రలకు అనుగుణంగా కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేస్తారు. వాటిని ధరిస్తాను. షూటింగ్‌లున్నప్పుడు చక్కగా తలస్నానం చేసి, ముఖాన్ని ఒకటికి రెండు సార్లు కడుక్కుని వెళ్తా. షూటింగ్‌ స్పాట్‌లో మేకప్‌ ఆర్టిస్ట్ లు నా ముఖంలో ఉన్న ప్లస్‌లు, మైనస్ లను గుర్తించి, సరిదిద్ది, అందరికీ నచ్చేలా తీర్చిదిద్దుతారు. షూటింగ్‌లు లేకపోతే అత్యంత తక్కువ మేకప్ తో ఉంటాను. కిలోలు, టన్నులు మేకప్ లు వేసుకునేవాళ్లను చూస్తే నవ్వొచ్చేస్తుంది’’ అని చెప్పారు.