ముగిసిన దాసరి అంత్యక్రియలు

ప్రఖ్యాత తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు అంత్యక్రియలు ముగిశాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఆయన ఫాంహౌజ్ లో రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. నారాయణరావు సతీమణి పద్మ సమాధి పక్కనే ఆయన అంత్యక్రియలు చేశారు. తెలుగు సినీపరిశ్రమ యావత్తు దాసరి అంత్యక్రియలకు తరలివచ్చారు. పలువురు మంత్రులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. కన్నీటి మధ్య దాసరికి తుది వీడ్కోలు పలికారు.