బ్రస్సేల్స్‌లో గమ్మతైన సంఘటన!

బ్రస్సేల్స్‌లో ఓ గమ్మతైన సంఘటన జరిగింది. నాటో సమావేశాలకు హాజరైన దేశాధ్యక్షుల భార్యలు దిగిన ఫోటోలో ఓ జెంటిల్మెన్‌ దర్శనమిచ్చాడు. అవును నాటో సమావేశాల సందర్భంగా పలు దేశాల ప్రథమ పౌరురాళ్లైనా ఆయా దేశ అధ్యక్షుల భార్యలు గ్రూప్‌ ఫోటో దిగాలని భావించారు. ఐతే ఇది ప్రథమ మహిళలకు సంబంధించిన ఫోటోయే అయినా.. ఓ జెంటిల్మెన్‌ కూడా ఆ ఫోటోలో ఉండాల్సి వచ్చింది. దీనికి కారణం లేకపోలేదు. లగ్జెంబర్గ్‌ దేశ ప్రధాని గ్జేవియర్‌ బెట్టల్‌ మరో యువకుడైన గౌతియర్‌ డెస్టినే అనే వ్యక్తిని వివాహం చేసుకున్నాడు. దీంతో ఆ దేశ ప్రథమ పౌరురాలు స్థానంలో గౌతియర్‌ కు స్థానం దక్కింది. ఇక ప్రథమ మహిళలు తీసుకోవాలనుకున్న ఫోటోలో అలా ఆయన దర్శనమిచ్చారు. ఇప్పుడు ఈ  ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.