బాలానగర్, మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్లపై వేటు

రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలు ప్రారంభమయ్యాయి. బాలా నగర్ సబ్ రిజిస్ట్రార్ మహ్మద్ యూసఫ్, మేడ్చల్  సబ్ రిజిస్ట్రార్ రమేశ్ చంద్రారెడ్డి లను .. ఉన్నతాధికారులు సస్పెండ్ చేసారు. ఇప్పటికే  కూకట్  పల్లి  సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు సస్పెండయ్యారు. ఈ ముగ్గురిపై  క్రిమినల్  కేసులు నమోదయ్యాయి. శ్రీనివాసరావును అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. యూసఫ్, రమేశ్ చంద్రారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.