బాధ్యతలు చేపట్టిన ఫుడ్ కమిషన్

తెలంగాణ రాష్ట్ర ఫుడ్ క‌మిష‌న్ ఛైర్మన్ గా కొమ్ముల తిరుమ‌ల్ రెడ్డి, స‌భ్యులుగా ఓరుగంటి ఆనంద్, కే గోవ‌ర్ధన్ రెడ్డి, రంగినేని శార‌ద‌, బానోతు సంగులాల్, మ‌ట‌కుంట్ల భార‌తి పదవీ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రి ఈటెల రాజేందర్, విప్ గంప గోవర్ధన్, ఎంపీ కవిత, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు.