బంగ్లా తీరాన్ని తాకిన మోరా తుఫాన్

మోరా తుఫాన్ బంగ్లాదేశ్ తీరాన్ని తాకింది. కాసేపట్లో చిట్టగాంగ్ సమీపంలో తుఫాన్ తీరందాటనున్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. మోరా ప్రభావంతో పశ్చిమబెంగాల్ పాటు ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తుఫాన్ తీరం దాటే సమయంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇవి మరో 24 గంటల్లోగా కేరళ తీరాన్ని తాకే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో 48 గంటలుగా లక్షద్వీప్, దక్షిణ కేరళలోని పలు ప్రాంతాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.