ప్రశాంతంగా ముగిసిన గురుకుల టీచర్ టెస్ట్

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ వేగవంతమైంది. అందులో భాగంగా టీజీటీ, పీజీటీ, పీడీ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ప్రాథమిక పరీక్షను నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 211 పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఒక లక్షా 9 వేల949 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు పరీక్ష జరిగింది. ఇందుకోసం టీఎస్పీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఎగ్జామ్ హాల్ దగ్గర అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ ఎగ్జామ్ కు కూడా ఒక్క నిమిషం లేటు నిబంధన అమలు చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించలేదు. హాల్ టికెట్ తో పాటు గుర్తింపు కార్డును పరిశీలించి అభ్యర్థులను లోపలికి అనుమతించారు. అటు అభ్యర్థుల బయోమెట్రిక్ ను కూడా తీసుకున్నారు. మొత్తానికి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.