ప్రజల్ని భాగస్వాముల్ని చేయాలి

అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టుదలతో పనిచేసి హరితహారాన్ని విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు కోరారు. హరితహారాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా చూడొద్దని.. ప్రజలు పెద్దెత్తున ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మూడో విడత హరితహారంపై అధికారులు, ప్రజాప్రతినిధులకు అవగాహన సమావేశం నిర్వహించారు. మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్‌, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, సున్నం రాజయ్య, అటవీశాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతకముందు ప్లాంట్‌ ఎగ్జిబిషన్‌ ను వారు సందర్శించారు.