పోలీస్ స్టేషన్ లో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి పరిహారం

గుండెపోటుతో పోలీస్ స్టేషన్ లో చనిపోయిన వ్యక్తి భార్యకు రూ.5 లక్షల పరిహారం చెక్కును హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అందజేశారు. ఈ ఏడాది మార్చి 18న విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చిన భీంసింగ్ గుండెపోటుతో చనిపోయాడు. మృతుని భార్యకు సచివాలయంలోని తన ఛాంబర్ లో నాయిని చెక్కు అందజేశారు.