పాకిస్థాన్ కు ధీటుగా జవాబు

లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట భారత పోస్టులపై దాడికి ప్రయత్నించిన పాకిస్థాన్ బార్డర్ యాక్షన్ టీమ్ కు ధీటుగా సమాధానమిచ్చింది ఇండియన్ ఆర్మీ. యూరీ సెక్టార్ లో భారత పోస్టులపై దాడికి యత్నించిన పాక్ జవాన్లపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు పాక్ సైనికులు హతమయ్యారు. పాక్ సైన్యం దాడితో అప్రమత్తమైన సైన్యం లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి నిఘా పెంచింది. యూరీ సెక్టార్ లో కూంబింగ్ కొనసాగిస్తోంది.