నాలుగు దేశాల పర్యటనకు బయలుదేరిన ప్రధాని

నాలుగు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడి జర్మనీ బయల్దేరి వెళ్లారు. ఆరు రోజుల పాటు ఆయన జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, రష్యాల్లో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం బెర్లిన్ చేరుకోనున్న ప్రధాని… అక్కడ జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్ ఏర్పాటు చేసే విందులో పాల్గొంటారు. నాలుగు దేశాల పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్, ఫ్రాన్స్ నూతన అధ్యక్షుడు ఎమాన్యుల్ మెక్రాన్ లతో ప్రధాని భేటీ అవుతారు.