నాటి ఉద్యమమే నేటి తెలంగాణకు నాంది

1969లో జరిగిన పోరాటం నేటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మార్గం వేసిందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లో 1969 విద్యార్ధి నేతల ఉద్యమ చరిత్ర అనే పుస్తకాన్ని రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్, ప్రభుత్వ సలహాదారు వివేక్‌లతో కలిసి నాయిని ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో అమరుల త్యాగాలు మరవలేనివని, వారి కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం గుర్తిస్తుందని నాయిని హామీ ఇచ్చారు. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించిన కేసీఆర్‌.. రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. 1969 తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి.. పరిష్కారానికి కృషి చేస్తానని హోంమంత్రి నాయిని హామీ ఇచ్చారు.