పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం

తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా తెలంగాణకు పెట్టుబడులు పెరిగాయని చెప్పారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం రాచూరు సమీపంలో రూ.110 కోట్లతో నిర్మించిన వెంటేజ్‌ కాఫీ కంపెనీని  జూపల్లి ప్రారంభించారు. కంపెనీలో కలియతిరిగి కాఫీ పొడి తయారీ విధానం, కాఫీ గింజల దిగుమతి, పొడి ఎగుమతిని అడిగి తెలుసుకున్నారు. కేవలం 15 రోజుల్లో ఎలాంటి పైరవీలు లేకుండా కాఫీ కంపెనీకి అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున కంపెనీలను ఆహ్వానించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి చెప్పారు.