టీ న్యూస్, అపెక్స్ ఎడ్యుకేషన్ ఫెయిర్ కు విశేష స్పందన

టీ న్యూస్, అపెక్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న తెలంగాణాస్ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్-2017కు విశేష స్పందన లభిస్తోంది. హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్స్ వేదికగా ఫెయిర్  జరుగుతోంది. కాలేజీల సమాచారం తెలుసుకునేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఎడ్యుకేషన్  ఫెయిర్ ఎంతో ఉపయుక్తంగా ఉందని చెపుతున్నారు. ఫెయిర్  నిర్వహిస్తున్న టీ న్యూస్ ను అభినందిస్తున్నారు.