టిఆర్ఎస్ మహిళ, విద్యార్థి సంఘాలకు అధ్యక్షులు వీరే!

టిఆర్ఎస్ మహిళ, విద్యార్థి విభాగాలకు అధ్యక్షులను నియమించారు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్. టిఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా మాజీ ఎంపి గుండు సుధారాణిని నియమించారు. వరంగల్ జిల్లాకు చెందిన సుధారాణి రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. ఆమెకు ప్రభుత్వపరంగా ఉమెన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా నియమిస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు.

టిఆర్ఎస్ విద్యార్థి విభాగం తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సమితి(టిఆర్ఎస్వి) అధ్యక్షుడిగా ఓయు విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాసయాదవ్ ని సీఎం కేసీఆర్ నియమించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీనివాసయాదవ్ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను సమీకరించడంలో చురుగ్గా పాల్గొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో విద్యార్థుల మద్దతు కూడగడుతున్నారు.