జూన్ 10 నాటికి రైతు సమగ్ర సర్వే పూర్తి చేయాలి

రైతు సమగ్ర సర్వేని ఎట్టి పరిస్థితుల్లో జూన్ 10 నాటికి పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యక్తిగత పర్యటనకు అమెరికా వెళ్లిన ఆయన అక్కడి నుంచి ప్రతి రోజు టెలి కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ అధికారులతో మాట్లాడుతున్నారు. ఏఈవోలు నమోదు చేస్తున్న వివరాలను జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు ప్రతిరోజు సమీక్షించాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న సమగ్ర రైతు సర్వే కోసం ముఖ్యమంత్రి ప్రత్యేకంగా 100 లైన్ల సామర్థ్యంతో టెలీ కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని కల్పించారు.