జస్టిస్‌ కర్ణన్ ఎక్కడ? 

సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే ధిక్కార స్వరాన్ని వినిపించిన కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి కర్ణన్ ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన కనిపించకుండా పోయి ఇప్పటికి 20 రోజులైనా పోలీసులు ఆయన ఆచూకీ కనుక్కొలేకపోతున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై తిరగబడి కలకలం సృష్టించిన జస్టిస్‌ కర్ణన్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌ ఈ నెల 9న తీర్పు వెలువరించింది. వెంటనే కర్ణనను అరెస్ట్‌ చేయాలంటూ పశ్చిమ బెంగాల్‌ పోలీస్‌ డీజీపీకి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులు జారీ అయిన రోజే జస్టిస్‌ కర్ణన చెన్నై వచ్చారు. చెన్నైకు వచ్చిన పశ్చిమ బెంగాల్‌ పోలీసులు రాష్ట్ర పోలీసుల సహకారంతో పలు ప్రాంతాల్లో గాలించినా జస్టిస్‌ కర్ణన ఆచూకీ తెలియలేదు. ఆయన ఫోన స్విచాఫ్‌ అయినట్లు పోలీసులు తెలిపారు.