చైతన్యదీప్తి సురవరం

సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ చైతన్య దీప్తి అని కొనియాడారు ప్రభుత్వ సలహాదారుడు కేవీ రమణాచారి, గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చెర్మన్ డాక్టర్ శ్రీధర్, బిసి కమిషన్ చెర్మన్ బిఎస్ రాములు. హైదరాబాద్ నగర గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో చిక్కడపల్లి సిటీ లైబ్రరీలో సురవరం ప్రతాపరెడ్డి జయంతి వేడుకల్లో వారు పాల్గొన్నారు. సురవరం ప్రతాపరెడ్డికి నివాళులు అర్పించారు. ప్రతాపరెడ్డి తన వ్యాసాల ద్వారా తెలంగాణ ప్రజలను చైతన్యపరిచారని గుర్తు చేసుకున్నారు.